నలుగురు వున్నప్పుడు మాట్లాడలేకపోతున్నారా..? ఇలా చేస్తే ఈజీగా మీరూ మాట్లాడచ్చు..!

-

చాలా మంది నలుగురు ఉన్నప్పుడు మాట్లాడలేరు. కానీ ఏదో ఒకటి చెప్పాలని… వాళ్ళ ఉద్దేశాన్ని కూడా వ్యక్త పరచాలని అనుకుంటూ ఉంటారు. కానీ నలుగురు ఉన్నప్పుడు మాట్లాడే ధైర్యం చేయలేకనో లేదంటే తప్పులు ఉంటాయనో చెప్పరు. మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారా..? నలుగురు ఉన్నప్పుడు మాట్లాడలేకపోతున్నారా అయితే వీటిని పాటిస్తే ఖచ్చితంగా మీరు నలుగురు ఉన్నప్పుడు కూడా మాట్లాడగలరు. మరి ఎలా నలుగురు ఉన్నప్పుడు మాట్లాడొచ్చు అనే విషయాన్ని చూసేద్దాం.

చిన్న విషయాలని స్కిప్ చేయకండి:

మీరు ఏదైనా మాట్లాడాలని అనుకుంటే ఒక చిన్న పాయింట్ ని తీసి కూడా మాట్లాడొచ్చు అవకాశం రాదని అలా కూర్చోకండి. కచ్చితంగా చిన్న లైన్ తీసుకుని మీరు స్టార్ట్ చేస్తే మాట్లాడడం ఈజీ అవుతుంది.

ఫోన్ ని దూరంగా ఉంచండి:

చాలామంది అందరూ మాట్లాడుకునేటప్పుడు ఫోన్లో నిమగ్నం అయిపోతూ ఉంటారు అలా చేయడం వలన అసలు మాట్లాడలేరు కాబట్టి ఫోన్ ని దూరంగా ఉంచండి.

ఫ్లో లో వెళ్లిపోండి:

అక్కడ జరిగే విషయాలను మీరు క్యాచ్ చేస్తే కచ్చితంగా మీరు కూడా అవకాశాన్ని తీసుకోవచ్చు. మైండ్ ప్రెసెంట్ కింద ఉంచుకుంటే కచ్చితంగా మాట్లాడటం ఈజీ అవుతుంది.

ఇతరులు ఏమనుకుంటారు అని ఆలోచించొద్దు:

మీరు మాట్లాడితే ఇతరులు ఏమంటారు అనే విషయాలని మర్చిపోండి ఒక స్టెప్ ముందుకు వేస్తేనే కదా ఏదైనా మీరు సాధించడానికి అవుతుంది. మాట్లాడలేకపోతుంటే మీరు భవిష్యత్తులో ముందుకు ఎలా వెళ్తారు కాబట్టి అవకాశం తీసుకుని మొదట మాట్లాడండి ఇతరులు ఏమనుకుంటున్నారు అనేది మర్చిపోండి.

Read more RELATED
Recommended to you

Latest news