పీఎఫ్ అకౌంట్ కు మొబైల్ నెంబర్ ను అప్డేట్ చేసుకోలేదా?.. ఇలా చెయ్యండి..

-

ఉద్యోగం చేసే వ్యక్తికి పీఎఫ్ అనేది చాలా ముఖ్యమైనది.. తర్వాత ఈ పీఎఫ్ డబ్బులు చాలా అవసరం.. పీఎఫ్‌ అకౌంట్‌ ఉన్న వారికి ప్రతినెల అకౌంట్‌కి డబ్బులు జమ అవుతుంటాయి.. ప్రతీ నెల జమ అయ్యే డబ్బుల వివరాలు మీ మొబైల్‌కు ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్‌లో వస్తుంది. కానీ కొందరికి మెసేజ్‌ రాదు. అందుకు కారణం మీ మొబైల్ నెంబర్, ఇమెయిల్ సరిగ్గా లేకపోవచ్చు. మీరు మీ ఈపీఎఫ్ అకౌంట్‌కి పాత మొబైల్, పాత ఇమెయిల్ ఐడీ ఇచ్చారేమో ఓసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీ ఈపీఎఫ్ అకౌంట్‌లో పాత మొబైల్ నెంబర్, పాత ఇమెయిల్ ఐడీ ఉంటే మీరు ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.. అప్పుడే మనకు ప్రతి సమాచారం అందుతుంది..

మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి మార్చుకొనేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతిదీ ఆన్‌లైన్‌లో చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. బ్యాంకింగ్‌ సర్వీసుల నుంచి ఈపీఎఫ్‌ వరకు అన్ని కూడా ఆన్‌లైన్‌లోనే చేసుకునే సదుపాయం వచ్చేసింది. ఇలా పీఎఫ్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లోనే మీ మొబైల్ నెంబర్, ఇమెయిల్ అప్‌డేట్ చేయవచ్చు. ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో సులభంగా మార్చుకునే వెసులుబాటు ఉంది.. ఇప్పుడు ఎలా అప్డేట్ చేసుకోవాలో తెలుసుకోండి.. స్టెప్ బై స్టెప్ మీ కోసమే..

*. ముందుగా పోర్టల్ ఓపెన్ చేయండి.
*. ఆ తర్వాత యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) మరియు పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేసి లాగిన్ అవండి.
*. ఆ తర్వాత manage సెక్షన్ పైన క్లిక్ చేయండి.అందులో contact details పైన క్లిక్ చేయండి.
*. పాత మొబైల్ నెంబర్ ఉంటే change mobile number పైన క్లిక్ చేయాలి.
*. మీ కొత్త మొబైల్ నెంబర్‌ను రెండు సార్లు ఎంటర్ చేయాలి.
*. Get Authorization Pin పైన క్లిక్ చేయాలి.
మీ కొత్త మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
*. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
*. ఈపీఎఎఫ్ అకౌంట్‌లో కొత్త మొబైల్ నెంబర్ అప్‌డేట్ అవుతుంది..

మెయిల్ ఐడి కోసం..

*. ముందుగా పోర్టల్ కు వెళ్ళండి..
*. ఆ తర్వాత manage సెక్షన్ పైన క్లిక్ చేయండి.
అందులో contact details పైన క్లిక్ చేయండి.
*. పాత ఇమెయిల్ ఐడీ ఉంటే Change E-Mail Id పైన క్లిక్ చేయండి.
*. మీ కొత్త ఇమెయిల్ ఐడీని రెండు సార్లు ఎంటర్ చేయాలి.
*. Get Authorization Pin పైన క్లిక్ చేయాలి.
మీ కొత్త ఇమెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది.
*. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
*. ఈపీఎఎఫ్ అకౌంట్‌లో కొత్త ఇమెయిల్ అప్‌డేట్ అవుతుంది.
*. ఇక ఇప్పటికే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అకౌంట్‌లో వడ్డీ జమ చేస్తోంది.
*. మీ మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ అప్‌డేట్ చేస్తే వడ్డీ జమ కాగానే మీకు వివరాలు వెంటనే తెలుస్తాయి…

Read more RELATED
Recommended to you

Latest news