కెప్టెన్ రోహిత్ శర్మ (81) అవుట్… భారమంతా ఆ ఇద్దరిపైనే !

-

రాజ్ కోట్ లో జరుగుతున్న మూడవ వన్ డే లో ఇండియా మెల్ల మెల్లగా మ్యాచ్ పై ఆధిపత్యం సాధించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఆస్ట్రేలియా ఇచ్చిన 353 పరుగుల టార్గెట్ ను చేధించే క్రమంలో ఇండియా మొదటి పది ఓవర్ లలో వికెట్ నష్టపోకుండా ఆడింది.. కానీ ఆ తర్వాత ఓపెనర్ గా ప్రమోట్ అయిన సుందర్ వికెట్ ను పోగొట్టుకున్నాడు.. అయినా కోహ్లీ తో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ రోహిత్ శర్మ కూడా అనవసర షాట్ కు ప్రయత్నించి పార్ట్ టైం బౌలర్ మాక్స్ వెల్ కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ తన ఇన్నింగ్స్ లో 57 బంతుల్లో ఫోర్లు మరియు 6 సిక్సులు సహాయంతో 81 పరుగులు చేశాడు. కానీ అంది వచ్చిన మంచి ఆరంభాన్ని భారీ స్కోర్ గా మలచడంలో రోహిత్ ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ మరియు శ్రేయాస్ లు ఉన్నారు..

వీరిద్దరూ బాధ్యతాయుతంగా ఆడితేనే ఆస్ట్రేలియా పై ఇండియా విజయం సాధించగలదు. ఇప్పుడు జట్టు భారం అంతా వీరిపైనే ఉంది. మరి ఏ విధంగా కోహ్లీ అయ్యర్ లు ఈ పరిస్థితిని చక్కదిద్దుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news