సార్స్ ని మించిపోయిన కరోనా, మరింత తీవ్రంగా…!

-

చైనాలో కరోనా వైరస్ తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. ఈ వ్యాధి ప్రపంచాన్ని అంతం చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజు రోజుకి వ్యాధి ముదురుతుంది గాని అదుపులోకి వచ్చే అవకాశాలు ఎక్కడా కనపడటం లేదనే చెప్పాలి. ఈ వ్యాధి ఇప్పుడు చైనాలో వీర విహారం చేస్తుంది. ఇప్పటి వరకు ఈ వ్యాధికి 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2003లో వచ్చిన సార్స్ వైరస్ ని కరోనా మించిపోయింది.

అప్పుడు 750 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పుడు ఆ సంఖ్య దాటింది. ఇదిలా ఉంటే కరోనా తీవ్రత దెబ్బకు చైనా ఆర్ధికంగా కూడా భారీగా నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి. చైనాతో ప్రత్యక్ష వ్యాపారాలకు అన్ని దేశాలు గుడ్ బై చెప్తున్నాయి. ఇప్పటి వరకు ఈ వ్యాధి 38 వేల మందికి పైగా సోకినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు గల్ఫ్ దేశాలకు ఈ వ్యాధి ఇంకా సోకలేదు.

అటు ఆఫ్రికా దేశాలకు గాని, దక్షిణ అమెరికా దేశాలకు గాని ఇప్పటి వరకు ఈ వ్యాధి ఎక్కడా సోకలేదు. ఒక్క మలేషియా లో మాత్రం 16 మందికి ఈ వ్యాధి సోకగా మన భారత్ లో ముగ్గురికి వ్యాధి సోకింది. అంతర్జాతీయంగా ఈ వ్యాధిపై అన్ని దేశాలు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి ప్రభుత్వాలు.

Read more RELATED
Recommended to you

Latest news