తెలుగు మీడియా ఛానల్ లో ప్రముఖుడు ఏబీఎన్ ఛానల్ అధినేత రాధాకృష్ణ పైన కేసు పెట్టే అవకాశాలు ఉన్నట్లు ఆంధ్ర రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే ఏబీఎన్ ఛానల్ ఒక ఉద్దేశపూర్వకంగా ఒక పార్టీకి కొమ్ము కాస్తూ రెడ్డి కులస్తులను బ్యాడ్ గా కథనాలు ప్రచారం చేస్తుందని రెడ్డి కులస్తులు కొంతమంది ఆరోపిస్తున్నారు.వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఇలాంటి కథనాలు మరీ ఎక్కువగా ఏబీఎన్ ఆర్కే ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. కులాన్ని దృష్టిలో పెట్టుకుని సమాజంలో ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టి ఒక ప్రముఖ పార్టీకి మరియు అదేవిధంగా తన కులానికి కొమ్ము కాస్తూ రెడ్ల కి లేనిపోనివి ఆపాదిస్తు వార్తలు తన మీడియా ఛానల్ లో ప్రసారం చేస్తున్నారని రెడ్డి సంఘం పెద్దలు ఏబిఎన్ ఆర్కే కి వార్నింగ్ తో పాటు కేసు పెట్టడానికి రెడీ అవుతున్నారు.
కుల రాజకీయాల గురించి మాట్లాడుతూ అన్ని కులాల కంటే రెడ్డి కులం పై చాలా దారుణంగా ఏబీఎన్ వార్తలు ప్రసారం చేస్తుందని మండిపడుతున్నారు.