నిఖిల్ ‘కార్తికేయ – 2’ కాన్సెప్ట్ వీడియో సూపర్బ్ గా ఉందిగా…!! 

-

యువ హీరో నిఖిల్ ఇటీవల అర్జున్ సురవరం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఆ సినిమా యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం దాని అనంతరం నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం యువ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కలర్స్ స్వాతి హీరోయిన్ గా తెరకెక్కిన ఆ సినిమాలో రావు రమేష్, సత్య, తులసి, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఒక ఊరిలో ఉన్న సుబ్రహమణ్యేశ్వర స్వామి ఆలయంలో గల ఆయన విగ్రహాన్ని చోరీ చేయాలనే ఉద్దేశ్యంతో ఒక కథను సృష్టించి కొందరు దుర్మార్గులు పన్నిన పన్నాగాన్ని చివరికి హీరో చేధిస్తాడు. పలు ఆసక్తికర మలుపులతో ముందుకు సాగె ఈ సినిమాలో క్లైమాక్స్ మాత్రం ఊహించిన రేంజ్ లో అయితే లేకపోవడం అప్పట్లో ప్రేక్షకులను కొద్దిపాటి నిరాసక్తికి గురిచేసింది. ఇకపోతే మళ్ళి ఇన్నేళ్లకు ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న కార్తికేయ 2 మూవీ షూటింగ్ ప్రారంభం సందర్భంగా సినిమా యూనిట్ ఒక కాన్సెప్ట్ వీడియోని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది.

5118 ఏళ్ల క్రితం నాటి యుగం అంతం సమయంలో ఒక అద్భుతమైన జ్ఞానసంపద కనుమరుగు అవుతుంది. దానిని ఈ యుగంలో కొందరు చేజిక్కించుకోవడానికి చేసే అన్వేషణ అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుందని ఆ వీడియోలో తెలిపారు. దీనిని బట్టి పార్ట్ 1 కంటే కూడా ఈ సినిమా మరింత ఆసక్తికరంగా ముందుకు సాగనుందని అర్ధం అవుతోంది. కాగా ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది….!!

Read more RELATED
Recommended to you

Latest news