చల్లారిన వెలగపూడి.. ఎంపీ నందిగం సురేష్ మీద కేసు !

-

తుళ్లూరు మండలం వెలగపూడిలో నిన్న రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గత రాత్రి రాళ్ల దాడిలో మరణించిన మరియమ్మ మృతదేహాన్ని తీసుకొని సీఎం క్యాంప్ ఆఫీస్ కు కూడా కాలనీ వాసులు బయలుదేరగా వెలగపూడి సెంటర్ లో అడ్డుకున్నారు పోలీసులు. దాడికి కారణమైన వారి 29 మంది పేర్లతో దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి.

ఎంపీ నందిగం సురేష్ పేరును కూడా చేర్చగా ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని దళిత సంఘాల నేతలు పేర్కొన్నారు. అర్ధరాత్రి ఘటనా స్థలానికి చేరుకున్న  హోం మంత్రి సుచరిత, మేరుగ నాగార్జున, ఎస్పీ విశాల్ గున్నీలు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని, న్యాయం‌ చేస్తామని హామీ ఇచ్చారు. అలానే ఎంపి నందిగం సురేష్ పేరును ఎఫ్.ఐ.ఆర్ లో‌ చేర్చారు పోలీసులు. హోం మంత్రి హామీతో  ఆందోళన విరమించారు. మరియమ్మ కుటుంబ సభ్యులు కు పది లక్షల రూపాయల చెక్ ను అందించారు హోం మినిస్టర్.

Read more RELATED
Recommended to you

Latest news