హైదరాబాద్ శివారులో ఉదయం నుండి 15 రోడ్డు ప్రమాదాలు !

-

హైదరాబాద్ శివారు మేడ్చల్ జిల్లా జవహార్ నగర్ కార్పోరేషన్ పరిధిలోని డంపింగ్ యార్డ్ రోడ్ఢు పై ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వేగంగా కారు, ఆటోలు బోల్తా పడుతున్నాయి. ద్విచక్ర వాహన దారులు సైతం పడిపోతున్నారు. ఈ రోజు ఉదయం నుండి సుమారు 15 ప్రమాదాలు జరిగినట్టు చెబుతున్నారు.

వారం రోజులుగా తరచూ డెంటల్ కాలేజీ నుండి సి.ఆర్.పి.యఫ్ వెళ్ళే దారిలో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. డంపింగ్ యార్డ్ నుండి రసాయానాలు రోడ్ల పైకి రావడం, దానికి చలి, మంచు తోడు కావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. దీని గురించి ఎన్ని సార్లు సమాచారం ఇచ్చినా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. ప్రమాదాలతో రోడ్డ పై నెత్తురోడి డంపింగ్ యార్డ్ కు బలయితేనేగాని స్పందించరా అంటూ అధికారులపై ప్రజలు మండి పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news