Breaking : నారా లోకేష్ కు పోలీసులు బిగ్ షాక్..!

నారాలోకేష్ కు విజ‌యవాడ పోలీసులు మ‌రోషాక్ ఇచ్చారు. లోకేష్ నిన్న న‌ర‌స‌రావుపేట వెళుతుండ‌గా ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తులు లేవ‌ని పోలీసులు అడ్డుకున్న సంగ‌తి తెలిసిందే. దాంతో నాలుగు గంట‌ల పాటు రోడ్డుపై హైడ్రామా నెల‌కొంది. గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ ప్రాతంలో పోలీసులు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను మరియు ఎమ్మెల్యేలను పోలీసులు ముంద‌స్తు అరెస్టులు చేశారు.

కాగా తాజాగా పోలీసులు నారాలోకేష్ కు మ‌రో షాక్ ఇచ్చారు. కోవిడ్ నిబంధ‌న‌లు ఉల్లంగించడం…ట్రాఫిక్ కు అంత‌రాయం క‌లిగించ‌డంతో పాటు పోలీసుల విధుల‌కు ఆటంకం క‌లిగించారంటూ లోకేష్ పై విజ‌య‌వాడ పీఎస్ లో ప‌లు సెక్ష‌న్ ల కింద కేసులు న‌మోదు చేశారు. మ‌రోవైపు తెలుగు మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌ల పూడి అనితపై కూడా పోలీసులు కేసు న‌మోదు చేశారు.