నగదు లావాదేవీలు ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేక దృష్టి.. ఇక రూ. 20వేలు దాటితే..

-

నగదు రూపంలో జరిగే లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ దృష్టిపెట్టింది. నగదు లావాదేవీల ద్వారా ఆదాయపు పన్ను ఎగవేస్తున్నారని ఇకపై వీటిని కూడా పర్యవేక్షించనుంది. రూ.20,000, ఆపై జరిగే నగదు లావాదేవీలన్నింటిపైనా నిషేధం విధించినటలు ఆదాయపుపన్ను శాఖ తెలిపింది.

హాస్పటల్‌ బిల్లులు నగదు రూపంలో చెల్సిస్తుంటే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే.. ఆదాయపు పన్ను శాఖ నగదు లావాదేవీలకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త ఆలోచనలకు నాంది పలికింది. అన్ని రకాల నగదు లావాదేవీలపై కన్నేస్తోంది. తాజాగా హాస్పిటల్స్‌లో, బంకెట్ హాళ్లు, వ్యాపారాల్లో జరిపే నగదు లావాదేవీలపై ఐటీ డిపార్ట్‌మెంట్ కన్నేసింది. ఆసుపత్రుల్లో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరుపుతోన్న వారిని ట్రేస్ చేస్తోంది. ఈ డేటాను ఆసుపత్రుల నుంచి సేకరిస్తోందట.. అంతేకాక నిబంధనలను పాటించని ఆసుపత్రులపై చర్యలు తీసుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ సమాయత్తమవుతోంది.

రూ.20 వేలు దాటిన ప్రతి ట్రాన్సాక్షన్, ఇకపై బ్యాంకు సంబంధిత అకౌంట్స్ ద్వారానే జరగాలి. అలాగే నగదుకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల మధ్య రూ.2 లక్షలకు మించిన లావాదేవీ జరగకూడదు. అంటే రెండు లక్షల రూపాయలకు మంచిన డబ్బును క్యాష్ రూపంలో తీసుకోవడానికి లేదా ఇవ్వడానికి వీల్లేదు. అలాగే నగదు రూపంలో ఏదైనా ట్రస్టుకు లేదా పార్టీకి చెల్లించిన డబ్బు, విరాళాలపై మినహాయింపు పొందడానికి కూడా వీల్లేదు. హాస్పిటల్స్, ఫంక్షన్ హాల్స్‌ వంటి వాటిల్లో జరిగే చెల్లింపులు ఎక్కువగా నగదు రూపంలోనే జరుగుతున్నాయి. దీంతో వీటి ద్వారా పన్ను వసూలు కావడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం దీనిపై దృష్టి పెట్టింది. తాజాగా కొత్త నిబంధనలు రూపొందించింది.

ఇకపై ఆస్పత్రుల్లో జరిగే నగదు లావాదేవీలపై కూడా నియంత్రణ ఉంటుంది. అలాగే పేషెంట్ పాన్ కార్డును ఆస్పత్రులు తప్పనిసరిగా నమోదు చేయాలి. ఇలా పాన్ కార్డు లేకుండా ఆస్పత్రుల్లో బిల్లులు తీసుకుంటే, వాటిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.. ప్రైవేటు ఆస్పత్రుల్లో పెద్ద ఎత్తున చెల్లింపులు జరిపే వారిపై కూడా ఐటీ శాఖ నిఘా ఏర్పాటు చేయనుంది. ఇలా సేకరించిన సమాచారం ఆధారంగా ఆదాయపు పన్ను వివరాల్ని పరిశీలిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news