గత కొంతకాలంగా తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్యన కావేరి జలాల గురించి వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా కన్నడ సంఘాలు ఈ రోజు కర్ణాటక బంద్ కు పిలుపును ఇవ్వగా, బంద్ జరుగుతుండగానే కావేరి జల నియంత్రణ మండలి గట్టి షాక్ ఇచ్చింది కర్ణాటక ప్రజలకు.. ఈ కావేరి జలాల సరఫరా విషయంపై ఈ రోజు ఢిల్లీ లో కావేరి జల నియంత్రణ మండలి అధ్యక్షతన కీలకమైన సమావేశం జరిగింది. కాగా ఇది కావేరి జల నియంత్రణ మండలి ఆదేశాలను సమర్ధించింది. అయితే ఈ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయం ప్రకారం కావేరి జలాలను వచ్చే నెల 15 వరకు తమిళనాడు రాష్ట్రానికి వదలాలని ఆదేశించారు.
అందులో కూడా ప్రతిరోజూ 3000 క్యూ సిక్కుల నీరు ఇవ్వాలని స్పష్టంగా తెలియచేసింది. ఇక గత కొన్ని రోజులుగా కన్నడ సంఘాలు చేస్తున్న నిరసనలకు అర్ధం లేకుండా నిర్ణయాలు వెలువడడంతో ఏమీ చేయలేని స్థితిలో అందరూ ఉండిపోయారు.