చంద్రబాబు అరెస్టుపై టీడీపీ కార్యకర్తలంతా మోత మొగిద్దాం : లోకేష్

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కి వ్యతిరేకంగా పెద్దగా ఎత్తున నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీడీపీ సెప్టెంబర్ 30న వినూతన నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. చంద్రబాబుకు మద్దతుగా సెప్టెంబర్ 30న రాత్రి 7 గంటల నుంచి రాత్రి 7.05 గంటల వరకు ఐదు నిమిషాల పాటు ప్రజలందరూ సీఎం జగన్ కి వినిపించేవిధంగా ఏదో ఒకరకంగా మోత మోగించాలని పిలుపునిచ్చారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.

ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేశారు లోకేష్. నియంత ముందు మొరపెట్టుకుంటే ఫలితముండదని.. అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందేనంటూ ప్రత్యేక పోస్టర్ ను పోస్ట్ చేశారు. ఐదు కోట్ల ఆంధ్రులందరూ ఒక్కటిగా ఇంట్లోనే, ఆఫీస్ లోనే ఇంకెక్కడ ఉన్నా సరే బయటికి వచ్చి గంట లేదా ప్లేట్ మీద గరిటెతో కొట్టాలని.. రోడ్డుపై వాహనంతో ఉంటే పక్కకు ఆపి హారన్ మోగించాలని కోరారు. ఎవ్వరూ ఏ రూపంలో నిరసనలు తెలిపినా సంబంధిత వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news