ఏపీ హైకోర్టు ఆదేశాలతో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారించేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. సీబీఐ అధికారులు కడప ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో కేసు విచారణను ప్రారంభించారు. ఈ కేసును ఏపీ ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది. సిట్ ఇప్పటివరకు జరిపిన విచారణ గురించి సీబీఐ అధికారులకు అడిగి తెలుసుకున్నారు. ఈ సిట్‌కు నేతృత్వం వహించిన ఎస్పీ అన్బురాజన్ కూడా కలిసి వివరాలు సేకరించనున్నారు. 2019 మార్చిలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. ఈ సందర్భంగా సీబీఐ దర్యాప్తు చేపట్టాలని అప్పటి ప్రతిపక్ష నేత, నేటి సీఎం జగన్ డిమాండ్ చేశారు. హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు.
అయితే అధికారంలోకి వచ్చాక హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. అయితే వివేకానంద కేసులో సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఆయన కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేట్టి ధర్మాసనం 4 నెలల ముందే ఈ కేసును సీబీకి అప్పగిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో దాదాపు 1,300 మంది అనుమానితులను విచారించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు హంతకులను గుర్తించలేదని హైకోర్టు ఆక్షేపించింది. కేసుపై విచారణ చేపట్టాలని సీబీఐని ఆదేశించింది.