జడ్జ్ ల మీద అనుచిత కామెంట్స్..పని మొదలెట్టిన సీబీఐ

-

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టింగులు పెట్టిన వారి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వీరిపై ఇప్పటికే సీఐడీ కేసులు నమోదు చేసిందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును సీబీఐకు అప్పగించాలని సీఐడీని అక్టోబరు 12న హై కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలతో తాజాగా సీబీఐ రంగంలోకి దిగింది. సీఐడీ నమోదు చేసిన కేసులను పరిశీలించింది.

అంతే కాదు ఈరోజు వారి మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఇక త్వరలో నిందితులను విచారించే అవకాశం ఉంది. నిజానికి ఈ కేసులో మొత్తం 17 మంది మీద సీఐడీ కేసులు నమోదు చేసింది. కానీ దర్యాప్తుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీబీఐకి కేసు అప్పగించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో 12 కేసులను 17 మంది మీద సీబీఐ విశాఖలో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు హైకోర్ట్ జడ్జ్ లు పని చేస్తున్నారని, వారంతా ఒక కులానికి వత్తాసు పలుకుతున్నారంటూ కొందరు జడ్జ్ లని కామెంట్ చేయడంతో హైకోర్ట్ సీరియస్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news