మాజీ మంత్రి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి సిబిఐ దూకుడు పెంచింది. ఈ హత్య కేసులు అనుమానం ఉన్న వారిని, సాక్షులను వరుసగా విచారిస్తుంది. ఎవరిని విచారణకు పిలుస్తుంది అనేది కూడా తెలియకుండా ఎవరికి ఏ సమాచారం ఇవ్వకుండా, అనుమానం ఉన్న అందరిని విచారణకు పిలుస్తుంది. ఇదికా ఉంటే… కడప నగరం లోని సెంట్రల్ జైలు ఆవరణంలో విచారణ జరుగుతుంది.
కడప కేంద్రంగా ప్రముఖులను విచారించడానికి సిబిఐ బృందం సిద్దమైంది. నేడు పులివెందుల వైసీపి నేత దేవిరెడ్డి శంకర్ రెడ్డి ని విచారించే అవకాశం ఉంది. అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఆయన ఉన్నారు. నేడో రేపో కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి తో పాటు వైఎస్ కుటుంభ సభ్యులను కొందరిని విచారించే అవకాశం ఉంది. వైఎస్ కుటుంభ సభ్యుల విచారణ అనంతరం… టిడిపి ఎమ్మెల్సీ బిటెక్ రవి, మాజీ మంత్రి, బిజెపి నేత ఆదినారయణ రెడ్డి లను విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది.