ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మనుగడ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. రాజకీయంగా బలోపేతం అవ్వడానికి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కీలక నియోజకవర్గాకు పార్టీ బాధ్యులను ప్రకటించడానికి చంద్రబాబు సిద్దమయ్యారు. నియోజకవర్గాల్లో పార్టీ బలంగా లేని నేపధ్యంలో, కొందరు నేతలను తప్పించడానికి ఆయన సిద్దమయ్యారు.
ఈ నేపధ్యంలోనే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన దివంగత వంగవీటి రంగ కుమారుడు వంగవీటి రాధాకృష్ణ కు సత్తెనపల్లి నియోజకవర్గ బాధ్యతలను ఇవ్వాలని చంద్రబాబు భావించారు. కోడెల శివ ప్రసాదరావు మరణించిన తర్వాత ఆ నియోజకవర్గానికి ఎవరిని ప్రకటించలేదు. ఇప్పుడు ఆ బాధ్యతలను రాధకు ఇవ్వడానికి చంద్రబాబు సిద్దమయ్యారు. నియోజకవర్గంలో 30 వేలకు పైగా కాపు సామాజిక ఓటర్లు ఉన్నారు.
గత కొంత కాలంగా రాధ పార్టీ కార్యాలపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. పార్టీ నుంచి దేవినేని అవినాష్ వెళ్ళిపోయిన తర్వాత రాధ ఆక్టివ్ అయ్యారు. అమరావతి ఉద్యమంలో కీలకంగా పాల్గొంటున్నారు. దీనితో ఆయనకు ఏదోక పదవి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. అటు గుంటూరు జిల్లా కార్యకర్తలు కూడా ఆయనను సత్తెనపల్లి నియోజకవర్గానికి పంపాలని భావిస్తున్నారు. పార్టీ అధిష్టానం రెండు మూడు రోజుల్లో దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అటు రాధ కూడా ఈ నియోజకవర్గానికి వెళ్ళడానికి సిద్దమయ్యారు.