12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షా తేదీ విడుదల చేసిన CBCE..

-

12వ తరగతి ప్రాక్టికల్ పరీక్ష తేదీలని సీబీఎస్ ఈ విడుదల చేసింది. ఈ పరీక్షలు జనవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 8వ తేదీ వరకు జరుగుతాయట. తేదీ విడుదల చేయడంతో పాటు ఖచ్చితమైన పరీక్షా విధానాన్ని జారీ చేసింది. ఈ ప్రాక్టికల్ పరీక్షల తేదీలు ఒక్కో పాఠశాలకి ఒక్కో విధంగా ఉంటుంది. ఈ పరీక్ష నిర్వహణ, మూల్యాంకనం.. చేయడానికి బోర్డ్ నుండి ఒక అబ్జర్వర్ ఉంటారు.

గత ఏడాది లాగానే ఈ ప్రాక్టికల్ పరీక్షలో ఇంటర్నల్ ఎగ్జామినర్ తో పాటు ఎక్స్ టర్నల్ ఎగ్జామినర్ ఉంటారు. బోర్డ్ నియమించిన ఎక్స్ టర్నల్ ఎగ్జామినర్ సమక్షంలో ప్రాక్టికల్ పరీక్షలు జరపాల్సిన బాధ్యత పాఠశాలలదే.

పరీక్షలు ముగిసి, మూల్యాంకనం పూర్తయ్యాక పాఠశాలలన్నీ విద్యార్థుల మార్కుల లిస్టుని ఆన్ లైన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం బోర్డ్, ప్రతీ పాఠశాలకి లింక్ ఇవ్వనుంది.

పరీక్షలు నిర్వహించే ముందు పాఠశాలల్లోని విద్యార్థులంరితో పాటు ఇంటర్నల్ ఎగ్జామినర్, ఎక్స్టర్నల్ ఎగ్జామినర్, అబ్జర్వర్ కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగాల్సి ఉంటుంది. ఈ గ్రూప్ ఫోటోలో ప్రతీ ఒక్కరి ఫోటో స్పష్టంగా కనబడాలి.

అదే కాదు, 10వ తరగతి విద్యార్థుల పరిక్ష తేదీలని ప్రకటిస్తారట. దాంతో పాటు పరీక్షా నిర్వహించే విధానాలని తెలియజేస్తామని బోర్డ్ ఛైర్మన్ అమిత్ త్రిపాఠి తెలియజేసాడు. కరోనా కారణంగా పదవ తరగతి పరీక్షలు రద్దవుతాయన్న నేపథ్యంలో ఈ ప్రకటన చేసారు.

ప్రతీ సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా మార్చి- ఏప్రిల్ లో పరీక్షలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న సాంకేతికత కారణంగా, అన్నిపనులు ఈజీగా అవుతున్నాయని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news