సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై రేపు నివేదిక…!

-

దేశ తొలి సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ క్రాష్ ఘననలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆ క్రాష్ కు సంబంధించిన నివేదికను రేపు డిసెంబర్ 31న ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలిసింది. డిసెంబర్ 9న తమిళనాడు నీలగిరి జిల్లా కూనూర్ సమీపంలో సీడీఎస్ బిపిన్ రావత్ ప్రమాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ Mi-17V-5 కుప్పకూలిన ఘటన యావత్ దేశాన్ని కలిచివేసింది. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి మధులిక రావత్ తో కలిపి 14 మంది దుర్మరణం పాలయ్యారు.

దీనిపై ఎయిర్ మార్షల్ మన్వేంద్ర సింగ్ నేతృత్వంలోని దర్యాప్తు బృందంలో ఆర్మీ, నేవీకి చెందిన ఇద్దరు బ్రిగేడియర్ స్థాయి అధికారులతో కలిసి ఓ సంయుక్త విచారణ కమిటీ ఏర్పాటైంది. తాజాగా ఈ కమిటీ క్షేత్రస్థాయిలో లభించిన ఆధారాలు, బ్లాక్ బాక్స్ లో ఉన్న వివరాల ఆధారంగా నివేదికను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ నివేదిక వెల్లడయితే ప్రమాదానికి కారణాలు తెలియనున్నాయి. ప్రమాదానికి వాతావరణం కారణమా.. లేక ఇంకేదైనా మెకానికల్ ఫెయిల్యూరా.. లేక పైలెట్ తప్పిదమా అన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news