Telangana : ఇంటర్‌లో కొత్తగా సీఈఏ గ్రూపు.. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి

-

తెలంగాణ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఇంటర్‌ విద్యలో మరో కొత్త గ్రూపును అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది. అకౌంటెన్సీ సబ్జెక్టుకు ప్రాధాన్యమిస్తూ సీఈఏగా పిలవనున్న ఈ గ్రూపును వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో అకౌంటెన్సీతో పాటు కామర్స్‌, ఆర్థికశాస్త్రం ప్రధాన సబ్జెక్టులుగా ఉండనున్నాయి.

‘‘ఇంటర్‌స్థాయిలోనే విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందేందుకు వీలుగా సీఈఏ గ్రూపును రూపొందిస్తున్నాం.  బోర్డు సమావేశం ఆమోదించింది. వచ్చే విద్యా సంవత్సరం(2023-24) నుంచి అందుబాటులోకి తెస్తాం’’ అని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులు ఉన్నాయి. చివరిసారిగా.. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం గణితం, ఆర్థికశాస్త్రం, కామర్స్‌ సబ్జెక్టుల సమ్మేళనంతో ఎంఈసీ గ్రూపు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు కొత్తగా సీఈఏ గ్రూపునకు శ్రీకారం చుడుతున్నారు. అయితే సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డుల్లో 11, 12 తరగతుల్లో అకౌంటెన్సీ సబ్జెక్టు ఎన్నో ఏళ్లుగా అమల్లో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news