రైతుబంధు పంపిణీకి సీఈసీ గ్రీన్ సిగ్నల్..!

-

తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఎన్నికలు కేవలం 6 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ కి ధీటుగా కాంగ్రెస్ నిర్వహిస్తుంటే..వీటికి పోటీగా బీజేపీ హోరా హోరీగా నిర్వహిస్తున్నాయి. మరోవైపు కమ్యూనిస్టు పార్టీలు తమ అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రైతుబంధు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు సీఈసీ ఆమోదం తెలిపింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం.. సర్కారు రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు సిద్ధం అయింది.

ఈ ఏడాది ఖరీఫ్‌కు సంబంధించిన నిధులు జమ చేసినప్పటికీ.. యాసంగి సీజన్ కోసం రెండో విడత నిధులు నవంబర్‌లోనే రైతులకు అందించాల్సి ఉంది. అయితే, ఎన్నికల కోడ్‌తో ఈ నిధుల విడుదల ఆగిపోయింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలకు ఈసీ ఆమోదం తెలుపడంతో.. నిధుల విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. ప్రభుత్వం ఖరీఫ్‌ సీజన్‌లో 70లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందించింది. కొత్తగా 1.5లక్షల మంది పోడు రైతులకు రైతుబంధు వర్తింప జేసింది. దాదాపు 1.54కోట్ల ఎకరాలకు రూ.7700కోట్లకుపైగా నిధులను రైతుల ఖాతాల్లో విడుదల వారీగా జమ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news