తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకున్న వేళ ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జాతీయ నేతలను రంగంలోకి దింపి తెలంగాణ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి మూడ్రోజుల పాటు తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రాష్ట్రానికి వస్తున్నారు. మూడ్రోజుల పాటు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆరు బహిరంగ సభలతో పాటు హైదరాబాద్ రోడ్ షోలో పాల్గొననున్నారు.
మోదీ మూడ్రోజుల తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఇదే..
- ఇవాళ మధ్యాహ్నం 1.25 గం.కు హకీంపేట విమానాశ్రయానికి రానున్న ప్రధాని మోదీ
- మ. 2.15 నుంచి 2.55 కామారెడ్డి బహిరంగ సభలో పాల్గొననున్న మోదీ
- సా. 4.15 నుంచి 4.55 గంటల వరకు మహేశ్వరం సభలో మోదీ ప్రసంగం
- రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేయనున్న ప్రధాని మోదీ
- రేపు కన్హ శాంతివనంలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న మోదీ
- రేపు మ. 2.15 నుంచి 2.45 గంటల వరకు తూప్రాన్‌లో మోదీ బహిరంగసభ
- రేపు మ.3.45 నుంచి సా. 4.25 వరకు నిర్మల్ సభలో పాల్గొననున్న మోదీ
- రేపు నిర్మల్ నుంచి హకీంపేట విమానాశ్రయానికి వెళ్లనున్న మోదీ
- రేపు సాయంత్రం తిరుపతికి వెళ్లనున్న ప్రధాని మోదీ
- ఎల్లుండి శ్రీవారి దర్శనానంతరం తిరుపతి నుంచి హకీంపేట రానున్న మోదీ
- ఎల్లుండి మ.12.45 నుంచి 1.25 వరకు మహబూబాబాద్‌లో మోదీ బహిరంగ సభ
- ఎల్లుండి మ. 2.45 నుంచి 3.25 వరకు కరీంనగర్లో మోదీ బహిరంగ సభ
- ఎల్లుండి సా. 5 నుంచి 6 వరకు హైదరాబాద్‌లో మోదీ రోడ్‌షో
- ఎల్లుండి సాయంత్రం 6.25 గంటలకు దిల్లీ వెళ్లనున్న మోదీ