ట్విట్ట‌ర్‌ను వ‌దిలి ‘కూ’ కు క్యూ క‌డుతున్న ప్ర‌ముఖులు..

-

సోష‌ల్ మీడియా దిగ్గ‌జంగా ట్విట్ట‌ర్ ఎంత ఫేమ‌స్ అయిందో అంద‌రికీ తెలిసిందే. దేశ అధ్య‌క్షుడి ద‌గ్గ‌రి నుంచి మొద‌లుకుని సామాన్యుడి వ‌ర‌కు కూడా ప్ర‌తి ఒక్క‌రూ త‌మ భావాల్ని తెల‌పాలంటే మాత్రం క‌చ్చితంగా ట్విట్టర్‌ను వాడాల్సిందే. అయితే ఇప్పుడు చాలామంది ఈ ట్విట్ట‌ర్‌కు గుడ్ బై చెప్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇందుకు ప్ర‌ధాణ కార‌ణం అయితే కేంద్రానికి అలాగే ట్విట్ట‌ర్‌క మధ్య ఉన‌న వివాదమ‌నే తెలుస్తోంది. ఇంకా చెప్పాల‌టే దేశీ సోషల్‌ మీడియా నెట్‌ వర్క్ అనే నినాదం బాగా పాపుల‌ర్ కావ‌డంతో ఇది కాస్తా ‘కూ’ కు వరంగా మారింద‌నే చెప్పాలి.

twitter
twitter

ఇప్ప‌టి వ‌ర‌కు అస‌లు కూ’ ను ప్రారంభించి కేవలం 16 నెలలే అవుతున్నా కూడా ఇప్ప‌టికే 10మిలియన్ల యూజర్లను దీని కాతాలో ఉన్నారంటూ సోషల్‌ మీడియాలో దీని హ‌వా ఎలా కొన‌సాగుతుందో తెలుస్తోంది. వాస్త‌వానికి అమెరికాకు చెందిన ఈ ట్విట్టర్ ను వాడుతున్న జ‌నాభాలో భారత్ లో ఎక్కువ‌గా 22.1 మిలియన్ల యూజర్లతో ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌న దేశం మూడో స్థానంలో ఉండ‌టం గ‌మ‌నార్హం.

కాగా ఇదే సమయంలో ట్విట్టర్‌ కు ప్రత్యామ్నాయంగా మ‌న దేశంలో కూ రావ‌డంతో ట్విట్టర్‌ కు షాక్ త‌గిలి న‌ట్టు అయింది. ఇటీవ‌ల ట్విట్టర్ దిగ్గ‌జం భారత్ దేశానికి చెందిన ప‌లు నిబంధనల్ని ఉల్లంఘిస్తూ వ్య‌వ‌హ‌రింస్తోంద‌ని చాలా వ‌ర‌కు ఫిర్యాదులు కేంద్రానికి అంద‌డంంతో కేంద్రం ట్విట్టర్‌కు పలు ఆదేశాలు కూడా ఇచ్చింది. కానీ వీటిని ట్విట్టర్‌ లైట్‌ తీసుకోవ‌డంతో కేంద్రానికి ట్విట్ట‌ర్‌కు వివాదం ముదిరింది. దీంతో కొంద‌రు కేంద్ర కేబినెట్‌ మినిస్టర్లు ట్విట్టర్‌ అకౌంట్‌ను వ‌దుల‌కుని మ‌రీ మ‌న దేశీ నెట్‌ వర్క్ అయిన కూ లో అకౌంట్ ఓపెన్ చేసి అంద‌రూ దీన్నే ఉప‌యోగించాంల‌టూ కోర‌డంతో అప్ప‌టి నుంచే దీనికి క్రేజ్ పెరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news