రామ్ గోపాల్ వర్మకి సెన్సార్ బోర్డ్ షాక్

-

రామ్ గోపాల్ వర్మ కి సెన్సార్ బోర్డ్ షాక్ ఇచ్చింది. గతంలో శంషాబాద్ టోల్ గేట్ వద్ద దారుణ హత్యాచారానికి గురయిన వెటర్నరీ డాక్టర్ మృతి నేపధ్యంలో ఆయన తెరకెక్కించిన దిశ ‘ఎన్కౌంటర్’ సినిమాకు సెన్సార్ చేయమని చెప్పి  సెన్సార్ బోర్డు కమిటీ రిజెక్ట్ చేసినట్టు చెబుతున్నారు. అసలు సినిమాకు సెన్సార్ ఇవ్వాలా లేదా అని  సెన్సార్  బోర్డు తేల్చలేకపోయినట్టు చెబుతున్నారు.

సినిమాలో రియల్ ఎన్ కౌంటర్ సీన్ లను పోల్చే విధంగా ఆర్ జీ వీ తీసినట్టు తెలుస్తోంది. నలుగురు సభ్యుల సెన్సార్ బృందం సినిమా సెన్సార్ రిజెక్ట్ చేయడంతో దిశ ‘ఎన్కౌంటర్’ సినిమా రివిజన్ కమిటీ ముందుకు వెళ్లనున్నట్టు చెబుతున్నారు. ఇక ఇప్పటికే దిశా ఎన్ కౌంటర్ మూవీ ఫై దిశా పేరెంట్స్  అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సెన్సార్ రిజక్ట్ అవడంతో సినిమా థియేటర్ లలో విడుదల కావడం మీద అనుమానాలు నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news