రూ.2000 నోట్ల చ‌లామ‌ణీ పై కేంద్రం క్లారిటీ

-

దేశంలో నోట్ల ర‌ద్దు త‌ర్వాత వ‌చ్చిన రూ. 2000 నోట్ల ముద్ర‌ణ‌, చ‌లామ‌ణ‌ణి పై కేంద్ర ప్ర‌భుత్వం క్లారిటీ ఇచ్చింది. మంగ‌ళ వారం రాజ్య స‌భ‌లో ఓ ఎంపీ అడిగిన ప్ర‌శ్న కు స‌మాధానం గా కేంద్ర ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి పంక‌జ్ చౌద‌రి ఈ విష‌యం పై క్లారిటీ ఇచ్చారు. కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాల‌తో 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రం నుంచే రూ. 2000 నోట్ల ముద్ర‌ణ ను నిలిపివేశామ‌ని తెలిపారు. 2018 మార్చి నాటికి దేశంలో మొత్తం చలామ‌ణి అవుతున్న నోట్ల లో 3.27 శాతం రూ. 2000 నోట్లు ఉన్నాయని తెలిపారు.

అది ప్ర‌స్తుతం అంటే 2021నవంబ‌ర్ నాటికి 1.75 శాతానికి ప‌డిపోయిందని కేంద్ర స‌హాయ మంత్రి పంక‌జ్ చౌద‌రి తెలిపారు. 1.75 శాతం అంటే.. 223.3 కోట్ల కు ప‌డిపోయింద‌ని క్లారిటీ ఇచ్చారు. అయితే ఆర్బీఐ తో కేంద్ర ప్ర‌భుత్వం సంప్ర‌దించిన త‌ర్వాత నోట్ల‌ను ముద్రించడం ప్రారంభం అయింద‌ని తెలిపారు. దీంతో 2019-20 వ‌ర‌కు జీడీపీ లో 12 శాతం నోట్లు పెరిగాయ‌ని తెలిపారు. అలాగే 2020-21 వ‌ర‌కు అది 14.5 శాతానికి పెరిగింద‌ని వివ‌రించారు. అయితే అది ఇప్పుడు 7.9 శాతానికి ప‌డిపోయింద‌ని కేంద్ర మంత్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news