ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సమీర్ శర్మ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞాప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పదవీ కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడగించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఏపీ సీఎస్ సమీర్ శర్మ పదవీ కాలం ఈ నెల 30 తో ముగయనుంది.
దీంతో గత కొద్ది రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం సీఎస్ సమీర్ శర్మ పదివీ కాలాన్ని పొడగించాలని కేంద్రాన్ని కొరింది. తాజా గా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞాప్తి మేరకు అంగీకరించింది. దీంతో ప్రస్తుతం ఉన్న సీఎస్ సమీర్ శర్మ పదివీ కాలం వచ్చే ఏడాది మే 31 వరకు సర్వీస్ లో ఉండనున్నారు. కాగ సీఎస్ వైసీపీ ప్రభుత్వా నికి అనుకూలంగా చాలా నిర్ణయాలు తీసుకున్నారని అందుకే ఆయన పదవీ కాలాన్ని పొడగించారని ప్రతి పక్ష టీడీపీ నాయకులు అంటున్నారు.