ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీ రెబల్ ఎంపీ రాఘురామ కృష్ణం రాజు మరో సారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి లేఖ రాశాడు. లేఖ లో వైసీపీ ప్రభుత్వం పై ఎంపీ రాఘు రామ మరో సారి విరుచుకుపడ్డాడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అత్యధికం గా అప్పులు తీసుకుంటుందని ఈ సారి లేఖ లో ప్రధాన మంత్రి మోడీ రాశాడు. కార్పొరేషన్ల పేరు తో అనేక చోట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకుంటుందని లేఖ లో ప్రధాని మోడీ కి తెలిపాడు.
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గ్యారంటీ అప్పులు రూ. 1.35 లక్షల కోట్లు దాటిందని అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాని కి చెందిన మొత్తం అప్పులు రూ. 7 లక్ష ల కు పై గా ఉంటాయని చేరాయని లేఖ ద్వారా ప్రధాని మోడీ తెలిపారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇష్ట రీతిన అప్పులు తీసుకుంటే ప్రజల పై తీవ్ర మైన భారం పడుతుందని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అప్పుల పై కేంద్ర ప్రభుత్వ తక్షణ మే కలగజేసుకోవాలని ప్రధాని మోడీ కి విజ్ఞాప్తి చేశారు. అలాగే అధిక మొత్తం లో అప్పులు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం పై కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.