ఈ-కామ‌ర్స్ కంపెనీల‌కు కేంద్రం షాక్‌.. అలా చేయ‌కపోతే భారీ ఫైన్ విధిస్తారు..

-

కేంద్ర ప్ర‌భుత్వం ఈ-కామ‌ర్స్ కంపెనీల‌కు షాకిచ్చింది. ఇక‌పై ఆయా ప్లాట్‌ఫాంల‌పై అమ్మే ప్ర‌తి వ‌స్తువును ఎక్క‌డ త‌యారు చేశారో తెల‌పాల్సి ఉంటుంది. దీంతో వ‌స్తువుల‌ను కొనుగోలు చేసే వినియోగ‌దారులు తాము కొంటున్న వ‌స్తువు ఏ దేశంలో త‌యారైందో వారికి సుల‌భంగా తెలుస్తుంది. అయితే ఇలా వినియోగ‌దారుల‌కు వ‌స్తువుల ఉత్ప‌త్తి దేశం వివ‌రాలు తెలియ‌జేయ‌క‌పోతే.. ఈ-కామ‌ర్స్ సంస్థ‌ల‌కు ఫైన్లు విధిస్తారు. ఈ మేర‌కు కేంద్ర వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ ఈ-కామ‌ర్స్ సంస్థ‌ల‌కు ఆదేశాలు జారీ చేశారు.

center issues warning to e-commerce companies to display products making country

నిజానికి ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు త‌మ వెబ్‌సైట్ల‌లో అమ్మే వ‌స్తువుల‌కు గాను అవి ఏ దేశంలో త‌యార‌య్యాయో కచ్చితంగా తెలిపే రూల్‌ను 2017 జూన్ నెల‌లోనే అమ‌లులోకి తెచ్చారు. కానీ దాన్ని ఎవ‌రూ పాటించ‌డం లేదు. అయితే తాజాగా చైనాతో నెల‌కొన్న వివాదాల నేప‌థ్యంలో ఈ -కామ‌ర్స్ సంస్థ‌లు ఆ నిబంధ‌న‌ల‌ను క‌చ్చితంగా పాటించి తీరాల్సి ఉంటుందని మంత్రి పాశ్వాన్ వెల్లడించారు. నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించే ఈ-కామ‌ర్స్ సంస్థ‌ల‌పై మొద‌టి సారి రూ.25వేలు, రెండో సారి రూ.50వేలు ఫైన్ విధిస్తారు. అయినా విన‌క‌పోతే ఏకంగా రూ.1 ల‌క్ష ఫైన్ లేదా 1 ఏడాది జైలు శిక్ష లేదా కొన్ని సంద‌ర్భాల్లో రెండూ విధించేందుకు అవ‌కాశం ఉంటుంది.

అయితే ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు మాత్రం ఇందుకు త‌మ‌కు మ‌రింత వ్య‌వ‌ధి కావాల‌ని కోరుతున్నాయి. త‌మ ప్లాట్‌ఫాంల‌లో ఉండే సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తేనే ఇందుకు వీల‌వుతుంది క‌నుక కొంత కాలం వ్య‌వ‌ధి ఇస్తే ఆ రూల్స్‌ను పాటిస్తామ‌ని చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news