BSNL ఆస్తుల‌ ను అమ్మేయ‌డానికి కేంద్రం ప్ర‌ణాళిక‌లు

కేంద్ర ప్ర‌భుత్వం మ‌రొక సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌భుత్వ రంగ సంస్థ లు అయిన BSNL MTNL కు సంబంధించిన స్థిరాస్తుల‌ను విక్ర‌యించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. కాగ BSNL MTNL ల‌కు దేశ వ్యాప్తంగా సుమారు రూ. 970 కోట్ల విలువైన స్థిర ఆస్తులు ఉన్నాయి. వాటి అమ్మి సొమ్ము చేసుకోవాలని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తుంది. BSNL MTNL స్థిర ఆస్తుల‌ను అమ్మే ప్ర‌క్రియా కేవలం 45 రోజల్లోగా పూర్తి చేస్త‌మ‌ని కూడా తెలిపారు.

ఈ విష‌యాన్ని అధికారికంగా BSNL ఛైర్మెన్, ఎండీ పీకే పుర్వార్ తెలిప‌రు. కాగ 2019 లో రూ. 69 వేల కోట్ల తో ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన పున‌రుద్ద‌ర‌ణ ప్యాకేజీ లో భాగంగా ఈ మాని టైజేష‌న్ ప్రక్రియా చేపడుతున్నారు. అయితే ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు అయిన BSNL MTNL ల ఆస్తుల అమ్మ‌కం పై ప్ర‌తి ప‌క్షాలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్ర‌యివేటు వ్య‌క్తుల లాభం కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఈ ఆస్తుల‌ను ఆమ్మేస్తుంద‌ని ఆరోపిస్తున్నాయి.