వారికి రెండో డోసు ఇవ్వండి… కేంద్రం కీలక ఆదేశాలు

-

కొవిషీల్డ్‌ రెండో డోసుపై కేంద్రం కీలక ఆదేశాలు ఆదేశాలు జారీ చేసింది. కొవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య విరామాన్ని కేంద్రం ఇటీవల పొడిగించిన విషయం తెల్సిందే. మొదటి డోసు తీసుకున్నాక 12 నుంచి 16 వారాల మధ్యలో రెండో డోసు తీసుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రెండో డోసు కోసం ఆస్పత్రులకు వెళ్లే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కేంద్రం తాజా ఆదేశాల మేరకు మొదటి డోసు తర్వాత రెండో డోసుకు గడువు ముగియకపోవడంతో వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద ఆరోగ్య సిబ్బంది రెండో డోసు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. దీంతో చాలా మంది రెండో డోసు కోసం వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఆదివారం కేంద్రం కీలక ఆదేశాలు ఆదేశాలు జారీ చేసింది.

రెండో డోసు కోసం ఇది వరకే అపాయింట్‌మెంట్‌ తీసుకున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. కొవిన్‌ పోర్టల్‌లో ఈ అపాయింట్‌మెంట్‌ రద్దు చేయలేదని తెలిపింది. వ్యాక్సిన్‌ కోసం వచ్చిన వారిని తిప్పి పంపొద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది .అయితే కొత్తగా రెండోడోసు కోసం అపాయింట్‌మెంట్‌ తీసుకునేవారికి మాత్రం గడువు పెంపు వర్తిస్తుందని తెలిపింది. దీనికి సంబంధించి కొవిన్‌ పోర్టల్‌లో మార్పులు చేసినట్లుగా వెల్లడించింది. తాజా ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వైద్య సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news