కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మన దేశంలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించింది. దీనితో ప్రజలు ఆర్ధికంగా చాలా వరకు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఎన్ని చర్యలు తీసుకున్నా లాక్ డౌన్ ఇబ్బందులు బయటకు చెప్పలేని విధంగా ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటుంది.
తాజాగా ఎల్‌పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లాక్ డౌన్ తో ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో సబ్సీడియేతర ఎల్‌పీజీ సిలిండర్(14.2కేజీలు)పై రూ.65 మేర తగ్గిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా ఎఫెక్ట్‌తో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు 55 శాతం వరకు తగ్గిపోయాయి. దీనితోనే సిలిండర్ ధర తగ్గించినట్టు ఐఓసీ ప్రకటించింది.
ఈ కొత్త ధర ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి రానుంది. ఈ ధరల తగ్గింపు వల్ల ఎల్‌పీజీ సిలిండర్ ఢిల్లీలో రూ.744కే లభించనుండగా, గత నెలలో ఇది రూ.805.5గా ఉండేది. దాదాపుగా 60 రూపాయల వరకు తగ్గింది.