పుచ్చకాయ కర్రీ ఎప్పుడైనా తిన్నారా.. ఇలా తయారు చేసుకోవచ్చు

-

వేసవి లో ఎక్కువగా అందరు వేడిని తగ్గించే ఆహార పదార్థాలే తీసుకుంటారు. అలాంటి ఆహార పదార్థాల్లో కొన్ని మజ్జిగ, కొబ్బరి నీరు, పుచ్చకాయ రసం వంటివి. వీటిలో పుచ్చకాయ ని అందరు ఎంతో ఇష్టపడతారు. వీటిలో పుచ్చకాయ ని ముక్కలుగా లేదా జ్యూస్ లాగా తీసుకుంటారని అందరికి తెలిసిన సంగతే.  పుచ్చ కాయ లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి.అయితే కొంచెం వెరైటీ గా పుచ్చకాయ తో కూర చేసుకుందాం.

పుచ్చకాయ కూర కి కావలసిన పదార్థాలు: 4 కప్పుల గింజలు తీసిన పుచ్చకాయ ముక్కలు,

¼ టీ స్పూన్ పసుపు,

1 1\2 టీ స్పూన్ కారం,

1 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ ,

¼ టీ స్పూన్ జీలకర్ర,

¼ కప్పు కొబ్బరి పాలు,

2 టీ స్పూన్ల నిమ్మ రసం.

కొత్తిమీర

తయారి విధానం: ఒక కప్పు పుచ్చకాయ ముక్కలు, కారం, కొత్తిమీర , వెల్లుల్లి, జీలకర్ర ను మిక్సిలో వేసి మెత్తగా మిక్సి చేసుకోవాలి. ఆ ప్యూరిని ఒక బాణలి లో పోసి స్టవ్ వెలిగించి సిమ్ లో ఉడికించాలి. అయిదు నిమిషాలు ఉడికించిన తరువాత కొబ్బరి పాలు, నిమ్మరసం వేసి మళ్ళి కొంత సేపు ఉడికించాలి. కాసేపు ఉడికిన తరువాత మిగిలిన పుచ్చకాయ ముక్కలు కూడా వేసి మూడు నిమిషాలు ఉడికించి దించాలి. అంతే  పుచ్చకాయ కూర రెడీ .

పోషక విలువలు;

కేలరీలు: 237

కొవ్వు 62 గ్రా 26% నుండి కేలరీలు

మొత్తం కొవ్వు 7 గ్రా 10%

సంతృప్త కొవ్వు 5.8 గ్రా 29%

కొలెస్ట్రాల్ 0 mg 0%

సోడియం 50.7 మి.గ్రా 2%

మొత్తం కార్బోహైడ్రేట్ 45.4 గ్రా 15%

డైటరీ ఫైబర్ 2.3 గ్రా 9%

చక్కెరలు 38.4 గ్రా 153%

ప్రోటీన్ 2.8 గ్రా 5%

Read more RELATED
Recommended to you

Latest news