రంగంలోకి దిగిన ఇండియా జేమ్స్ బాండ్…!

-

ఢిల్లీ మత ప్రార్ధనలు ఇప్పుడు దేశాన్ని భయపెడుతున్నాయి. అక్కడ ప్రార్ధనలు చేసిన వారికి కరోనా వైరస్ సోకడంతో ఇప్పుడు దేశం మొత్తం భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. నిజాముద్దీన్ మర్కజ్ కేంద్రంగా తబ్లిగ్ జమాత్ నిర్వహించిన సమావేశాల సందర్భంగా కరోనా బారిన పలువురు పడ్డారు. ఈ నేపధ్యంలో అక్కడ ఉన్న ముస్లిమ్ ఉలేమాలను ఆస్పత్రులకు తరలించడానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ రంగంలోకి దిగారు.

నిజాముద్దీన్ మర్కజ్ లోని ఉన్న వ్యక్తులను క్వారంటైన్‌కు తరలించాలని పోలీసులు కేంద్ర బలగాలు భావించగా… తబ్లిగ్ జమాత్ నేత మౌలానా సాద్ వద్దని అడ్డం పడ్డారు. దీనిపై కేంద్రం ఎం చెయ్యాలి అనే దాని మీద ఆలోచించి… కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దోబాల్ ని రంగంలోకి దించారు. విదేశీయులతోపాటు పలువురు తబ్లిగ్ జమాత్ కార్యకర్తలు నిజాముద్దీన్ ప్రాంతంలోని బంగ్లేవాలీ మసీదులో ఉండగా వారిని తరలించడానికి దోబాల్ వారిని ఒప్పించారు.

దాదాపు 24 గంటల ఆపరేషన్ తర్వాత మసీదులోని వారందరికీ పరీక్షలు చేయించేందుకు ఆసుపత్రికి తరలించి, వైరస్ వ్యాప్తి చెందకుండా… 2300 మందిని మర్కజ్ నుంచి భద్రతాధికారులు ఖాళీ చేయించి క్వారంటైన్ కి తరలించారు. ఢిల్లీలోని మర్కజ్ ప్రాంతంలోనే 216 మంది విదేశీయులున్నారు. ఇక వారిపై చర్యలు తీసుకోవడానికి విదేశాంగ శాఖ, హోం శాఖ సిద్దమయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news