కర్నూలుకు ఏపీ హైకోర్టు మార్పు.. కేంద్రం కీలక ప్రకటన

-

ఏపీ హైకోర్టును అమరావతి నుంచి మార్చే ప్రతిపాదన లేదని కేంద్రం తెల్చి చెప్పింది. అమరావతి నుంచి కర్నూలుకు మార్చే ప్రతిపాదన పెండింగ్‌లో లేదని స్పష్టం చేసింది. 2019 జనవరిలో రాష్ట్ర విభజన చట్టానికి అనుగుణంగా ఏర్పాటు చేశారని తెలిపింది. ఏపీ హైకోర్టు ప్రధాన బెంచ్‌ని విభజన చట్టానికి అనుగుణంగా ఏర్పాటు చేశారని పేర్కొంది.

2020 ఫిబ్రవరిలో కర్నూలుకు మార్చాలని సీఎం ప్రతిపాదించిన విషయాన్ని గుర్తు చేసింది. హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్‌ బదిలీ… సంబంధిత హైకోర్టుతో సంప్రదిస్తుందని.. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిపింది. హైకోర్టు నిర్వహణ ఖర్చు భరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేసింది.

హైకోర్టు సీజేకు కోర్టు రోజువారీ పరిపాలన నిర్వహించే బాధ్యత ఉంటుందని చెప్పింది. ప్రస్తుత హైకోర్టును కర్నూలుకు మార్చడంపై పూర్తి ప్రతిపాదన రావాలని.. ఏపీ ప్రభుత్వం, హైకోర్టు రెండూ తమ అభిప్రాయాలను రూపొందించాలని సూచించింది.

పూర్తి ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని కేంద్రమంత్రి కిరణ్‌ రిజుజు తెలిపారు. ప్రస్తుతానికైతే.. కేంద్రం వద్ద అలాంటి పూర్తి ప్రతిపాదన ఏదీ పెండింగ్‌లో లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు రాజ్యసభలో ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు.. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news