ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైనప్పటి నుండి కూడా వంటనూనె ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ఎప్పటికప్పుడు దేశ ప్రజలపై ధరల భారాన్ని తగ్గించడానికి కేంద్రం చూస్తోంది. అయితే తాజాగా అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా ఉత్పత్తులు ధరలు తగ్గించాలని ప్రభుత్వం వంట నూనె బ్రాండ్ కంపెనీలకి చెప్పింది అయితే ఇందుకోసం సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్ ల అసోసియేషన్ కి తెలిపింది తక్షణం ధరలని తగ్గించడం సాధ్యం కాదని కంపెనీలు అంటున్నాయి.
ఆవాల పంట కొరత మొదలయ్యే మర్చి దాకా రిటైల్ ధరలని తగ్గించడం వీలు అవ్వదు అని పరిశ్రమ వర్గాలు ప్రభుత్వానికి చెప్పాయి. సోయాబీన్ పొద్దుతిరుగుడు పామాయిల్ వంట నూనెల్ని ఎమ్మార్పీని అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా తగ్గించలేదని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటోంది. ఇప్పటికిప్పుడు వంట నూనె ధరలను తగ్గించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పరిశ్రమకు చెందిన అధికారులు అంటున్నారు. ప్రతి నెల ఎంఆర్పిని సవరించడం జరుగుతోంది