కుప్పకూలిన రష్యా సైనిక విమానం.. 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు మృతి..!

-

రష్యా-ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యాకు చెందిన విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 65 మంది ఉక్రెయిన్‌ యుద్ధ ఖైదీలు మృతి చెందారు. యుద్ధ ఖైదీలు, ఆరుగు సిబ్బంది, మరో ముగ్గురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న రష్యా సైనిక విమానం ఉక్రెయిన్‌ సమీపంలోని బెల్గోరోడ్‌ ప్రాంతంలో బుధవారం కుప్పకూలిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉదయం 11 గంటల సమయంలో ఈ విమానం కుప్పకూలిందని పేర్కొంది. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని పేర్కొంది.

ఘటనలో ఎవరైనా బ్రతికి బయటపడ్డారా? అని కూడా తెలియలేదని చెప్పింది. అయితే, అధికారులు విమానం కూలిపోవడానికి గల కారణాలపై అన్వేషిస్తున్నారు. ప్రత్యేక సైనిక మిషన్‌ విమానం కూలిన ప్రాంతానికి బయలుదేరిందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదానికి ముందు విమానం అదుపు తప్పి వేగంగా కిందికి పడిపోతున్నట్టు కనిపిస్తోంది. ఆ తరువాత ఇది నివాస ప్రాంతాల వద్ద నేలను తాకింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Read more RELATED
Recommended to you

Latest news