బ్రేకింగ్; కేంద్రం సంచలన నిర్ణయం…!

-

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది, నేటి మధ్యాహ్నం సమావేశం అయిన కేంద్ర కేబినేట్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. వీటిని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాకు వివరించారు. ఎంపీలకు నిధులు ఉండవని పేర్కొన్న ఆయన… కేంద్ర మంత్రులు ఎంపీల జీతాల్లో 30 శాతం కోత విధిస్తున్నామని, ఏడాది పాటు ఎంపీలకు నిధులు రెండేళ్ళ పాటు… ఎంపీ లాడ్స్ నిధులు ఉండవని పేర్కొన్నారు.

ఈ నిధులను కరోనాపై పోరాటానికి తాము వినియోగిస్తామని ఆయన పేర్కొన్నారు. లాక్ డౌన్ కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలకు కేంద్రం సాయం చేస్తుంది. ఇక ఆదాయం కూడా భారీగా పడిపోయింది కేంద్ర ప్రభుత్వానికి. గవర్నర్ల జీతాల్లో కూడా కోత విధించింది కేంద్రం. వారి జీతాల్లో 30 శాత కట్ చేయనున్నారు.

ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఉద్యోగుల జీతాలను వాయిదా వేసాయి. ప్రజాప్రతినిధులు కొందరు స్వచ్చందంగా ముందుకి వచ్చి తమ జీతాలను వదులుకున్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కేవలం.. పోలీసులు వైద్య సిబ్బందికి మాత్రమే పూర్తి స్థాయిలో జీతాలు అందిస్తారు. సఫాయి కార్మికులకు కూడా.

Read more RELATED
Recommended to you

Latest news