కరోనా వైరస్ కట్టడి చేయడంలో భారత ప్రభుత్వం 21 రోజులపాటు లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసినదే. మొదటిలో విదేశాలనుండి వచ్చిన వారి నుండి దేశం లో వైరస్ వ్యాప్తి చెందడం జరిగింది. అయితే ఆ టైంలో అంతా కంట్రోల్లో ఉందని అందరూ భావించారు. కొన్ని రాష్ట్రాల్లో మినహా దాదాపు దేశంలో చాలా రాష్ట్రాలు ఈ వైరస్ కంట్రోల్ లో ఉందని పేర్కొనటం జరిగింది. ఇటువంటి తరుణంలో ఢిల్లీ మర్కజ్ మసీదులో జరిగిన ప్రార్థన సమావేశాలకు వెళ్లిన వారికి కరోనా వైరస్ పాజిటివ్ రావటంతో దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ సంఖ్య ఒక్కసారిగా మారిపోయింది.విదేశాల నుండి ఈ మత ప్రార్థనలకు వచ్చినవారికి కరోనా వైరస్ ఉండి ఉంటుందని అందుకే దేశంలో ఇంతమందికి వచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా మసీదు లోపల ఏం జరిగింది అన్న దాని గురించి తెలిస్తే అంతమందికి కరోనా వైరస్ ఎలా వచ్చిందో అర్థం అవుతుందని డిమాండ్ ఇటీవల గట్టిగా వినపడింది. ఈ నేపథ్యంలో మర్కజ్ లోపల ప్రార్థన సమావేశాలకు నిర్వాహకులు చేసిన ఏర్పాట్లు గురించి వింటే ఎవరికైనా మతి పోవాల్సిందే. మసీదులో 300 మందికి సదుపాయం కలిగిన ఏర్పాట్లు ఉంటాయి…కానీ జరిగిన మత సమావేశాలకు పదము 13 వేల మంది రావడం జరిగింది.
ప్రార్థన సమావేశాలు జరుగుతున్న సమయంలో మసీదు లోపల జరిగిన వార్తలు ఎలా ఉన్నాయి. 300 మంది సౌకర్యాలు కలిగిన ఈ మసీదులో దాదాపు 13 వేల మంది 15 రోజులు ఉన్నారట. మసీదులో ప్రార్ధనలకని వెళ్ళిన వేలాదిమంది కొద్ది రోజుల పాటు ఒకేచోట భోజనం చేసి, పడుకున్నారట. భోజనం చేసినపుడు మంచినీళ్ళ సమస్య వచ్చిందని మొదటి వరసలో భోజనం చేసిన ప్లేట్లను కడగకుండానే తరువాత వరసలో భోజనం చేసిన వారు అవే ప్లేట్లలో తిన్నారట. ఇలాగ ఎనిమిది వరసల్లో భోజనాలు చేశారట. ఇలా ప్రార్ధనలు జరిగినన్ని రోజులు ఇలాగే జరిగిందని సమాచారం. భోజనం దగ్గరే పరిస్ధితి ఇలాగుంటే ఇక టాయిలెట్ల దగ్గర పరిస్ధితి ఎలాగుంటుందో ఊహించుకోవచ్చు. అతి తక్కువ టాయిలెట్లు సదుపాయం కలిగిన కూడా కొన్ని వేల మంది 15 రోజులు వాడుకోవడం జరిగింది అని వార్తలు బయటకు వచ్చాయి. దీని కారణంగానే కరోనా వైరస్ అంతమందికి సోకినట్లు అంచనా వేస్తున్నారు.