ఏపీ ప్రభుత్వంపై కేంద్రం సీరియస్‌

-

గృహ నిర్మాణ నిధులు దారిమళ్లించిన వైసీపీ సర్కారుపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం జీవో కూడా లేకుండా రూ.1,039 కోట్ల నిధులు దారిమళ్లించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. పీఎం ఆవాస్ యోజన పథకం కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.3,084 కోట్లు మంజూరు చేసి, అందులో రూ.1,879 కోట్లు విడుదల చేసింది. ఇందులో రూ.1,039 కోట్ల నిధులను దారిమళ్లించడంతో వైసీపీ ప్రభుత్వంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం జీవో లేకుండా ఈ నిధులను దారిమళ్లించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తక్షణమే సింగిల్ నోడల్ ఖాతాకు ఈ నిధులు రీయింబర్స్ చేయాలని ఆదేశించింది.

Andhra Pradesh: CM Jagan Mohan Reddy to go for Cabinet reshuffle on April  11 - Telangana Today

రూ.1,879 కోట్ల నుండి రూ.639 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించింది. రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన రూ.385 కోట్లతో పాటు రూ.113 కోట్ల మేర బిల్లులను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ బకాయి పెట్టింది. ప్రస్తుతం ఉమ్మడిగా నిర్వహించే సింగిల్ నోడల్ ఖాతాలో కేవలం రూ.1.5 కోట్లు ఉన్నాయి. మరోవైపు పీఎం ఆవాస్ యోజనకు రాష్ట్రం వాటాగా రావాల్సిన రూ.221 కోట్లను ఇవ్వలేదు. దీంతో కేంద్రం రూ.1,174 కోట్ల నిధులను నిలిపివేసింది. మరోవైపు, రూ.42.71 కోట్ల పెండింగ్ బిల్లులు నిలిచిపోవడంతో 211 లే-అవుట్లలో నీటి సరఫరా పనులు నిలిచిపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news