ఏపీకి కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో వేగంగా కరోన పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ వస్తుంది. ఇక ఏపీలో పలు ప్రాంతాలను హాట్ స్పాట్స్ గా రెడ్ జోన్స్ గా గుర్తించింది కేంద్రం. ఇక ఇప్పుడు జగన్ సర్కార్ కి పలు సూచనలు చేసినట్టు తెలుస్తుంది. అదే సమయంలో హెచ్చరికలు చేస్తుంది.

దేశవ్యాప్తంగా 96 జిల్లాలను రెడ్ జోన్‌గా ప్రకటించిన కేంద్రం.. ఏపీ నుంచి ఏడు జిల్లాలను రెడ్ జోన్స్ గా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఏపీలో విశాఖపట్నం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. రెడ్ జోన్ ఉన్న పరిధిలో కచ్చితంగా జనాలు ఎవరూ బయటకు రాకుండా చూడాలని లాక్ డౌన్ ని చాలా కఠినం గా అమలు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు చేసింది.

ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారిని వేగంగా గుర్తించాలని, వారి సమాచారం వెంటనే కేంద్రానికి ఇవ్వాలని, వారు ఎక్కడ తిరిగారు, ఎవరితో తిరిగారు అనేది గుర్తించి వెంటనే అందరికి పరిక్షలు చెయ్యాలని కేంద్రం స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. ఎవరిని కూడా బయటకు రానీయకుండా చూడాలని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక లాక్ డౌన్ విషయంలో కేంద్రం… నిర్ణయాన్ని రాష్ట్రానికే వదిలేసింది.

Read more RELATED
Recommended to you

Latest news