కేంద్ర పాలిత ప్రాంతం అయిన లడఖ్ లో 5 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల లడఖ్ ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. లడఖ్ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా తెలిపారు. లడఖ్ లో 5 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించిందని ట్వీట్ ద్వారా వెల్లడించారు.
లడఖ్ ను అభివృద్ధి చేసి సంపన్నంగా మార్చాలనే ప్రధాని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త జిల్లాల్లో జన్స్కార్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్తాంగ్ ఉన్నాయి. 2019లో లడఖ్ ను జమ్మూ కాశ్మీర్ నుంచి వేరు చేసి.. కొత్త కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. ఆ సమయంలో కేంద్ర పాలిత ప్రాంతంలో కేవలం రెండు జిల్లాలు మాత్రమే ఉన్నాయి. లేహ్, కార్గిల్. ఇప్పుడు లడఖ్ లో మరో 5 కొత్త జిల్లాలు జన్క్సార్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్ తంగ్ ఈ 5 జిల్లాలు ఏర్పడ్డాయి.