అన్నదాతల ఆందోళన కొనసాగుతోంది. ఈ రోజు 5 వ విడత చర్చలు జరగనున్నాయి. ఇప్పటి వరకు 4 విడతల చర్చలు జరిగినా ఏమీ తేలకపోవడంతో ఈరోజు రైతు సంఘాల నేతలతో మరోసారి చర్చలు జరపనున్నారు కేంద్ర మంత్రులు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్ భవన్‌లో కీలక సమావేశం జరగనుంది. డిసెంబర్ 3న జరిగిన చర్చల్లో కూడా మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణకే పట్టుపట్టారు రైతు సంఘాల నేతలు.
చట్టాల ఉద్దేశమే సవ్యంగా లేదని, పూర్తి గా ఉపసంహరణ మినహా, కేంద్ర మంత్రులు ప్రతిపాదించిన ఏలాంటి సవరణలకు అందీకరించేదిలేదని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. చట్టాల్లోని అభ్యంతరాలను అంశాల వారీగా రైతు సంఘాల నేతలు వివరించారు. కొన్ని అంశాలపై సవరణలకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం పేర్కొంది. మరోవైపు డిసెంబర్ 8న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. ఓ వైపు చర్చలు, మరోవైపు దేశ వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేసేందుకు రైతు సంఘాల ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.