BREAKING : ఒమిక్రాన్ పై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు… నైట్ కర్ఫ్యూ పెట్టండి !

-

కరోనా మహమ్మారి, ఒమీ క్రాన్ కట్టడి పై కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కరోనా మహమ్మారి, ఒమీ క్రాన్ కట్టడికి రాష్ట్రాలకు తాజాగా కేంద్రం సూచనలు చేసింది. కరోనా కేసుల పెరుగుదలపై రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. కరోనా, ఒమీ క్రాన్ పట్ల అన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఎక్కువ కేసులు ఉన్న కొవిడ్ క్లస్టర్ లను పర్యవేక్షించాలని.. కంటోన్మెంట్ ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ విధించారు అని ఆదేశాలు జారీ చేసింది.

ముఖ్యంగా పండుగల సీజన్ లో ఆంక్షలు, పరిమితులను విధించాలని కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు గుమిగూడి ప్రాంతాల్లో కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అర్హులైన ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని సూచనలు చేసింది. ప్రజలందరూ మాస్కులు ధరించేలా చూడాలి అని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news