అబార్షన్లపై కేంద్ర ప్ర‌భుత్వం కీలక నిర్ణయం..!

-

గ‌ర్భస్రావం ఇది చాలా సామాన్య మైపోయింది. మెడికల్‌ టర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగెన్సీ(ఎంటీపీ)గా పరిగణించే దీనిని 1971 జూన్‌లో చట్టబద్ధం చేసిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం ఐదు నెలలలోపు గర్భం వరకే ఇది పరిమితం. ఐదు నెలల తర్వాత గర్భస్రావ ప్రయత్నం ప్రమాదకరం చట్ట వ్యతిరేక చర్య కిందకి వస్తోంది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో గర్భం వల్ల తల్లి ప్రాణానికి ప్రమాదమయితే లేదా బిడ్డ సరిగ్గా రూపొందకపోతేనే గర్భస్రావం చేయాలి. ఇదిలా ఉంటే.. గర్భిణులు అబార్షన్లు చేయించుకునే కాల పరిమితి విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 20 వారాల వరకు గర్భం ఉన్నవారికి మాత్రమే అబార్షన్లు చేయించుకునే వెసులుబాటు ఉంది.

ఈ కాల పరిమితిని 24 వారాలకు పెంచారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. మహిళలు గర్భాన్ని తొలగించుకునే పరిమితిని 24 వారాలకు పెంచడం ద్వారా వారి పునరుత్పత్తి హక్కులను కాపాడినట్టవుతుందని ఆయన తెలిపారు. మొదటి ఐదు నెలల (20 వారాలు) తర్వాత శారీరక ఇబ్బందులు ఎదుర్కొనే గర్భిణులు… ఆ తర్వాత అబార్షన్ చేయించుకోవాలంటే కోర్టులకు వెళ్లాల్సి వస్తోందని… ఈ నేపథ్యంలో అబార్షన్ కు నాలుగు వారాల గరిష్ట పరిమితిని పెంచడం వారి హక్కులను కాపాడటమేనని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news