SECTION 66 A : కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం..

-

కేంద్ర హోంశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ – 2000 సెక్షన్ 66 ( ఏ ) కింద నమోదైన కేసులు ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఈ సెక్షన్ కింద కొత్తగా ఎలాంటి కేసులు నమోదు చేయకూడదని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఈ సెక్షన్ 66 ( ఏ ) ను రద్దు చేసి ఆరు సంవత్సరాలు అయినప్పటికీ..  కేసులు నమోదు చేయడం పై సుప్రీం కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేయడం తో… కేంద్ర హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో చట్టవిరుద్ధం మరియు ప్రమాదకర కంటెంట్ పోస్ట్ చేసిన వారిని ఈ సెక్షన్ కింద అరెస్టు చేసే అవకాశం ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో తాజాగా ఈ సెక్షన్ కింద కేసులు నమోదు చేయ కూడదని హోం శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్నీ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news