ప్రముఖ ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్న కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ఈ మేరకు కాసేపటి క్రితమే కీలక ప్రకటన వెలువడింది. గాయకుడు గోరటి వెంకన్నతో…. తగుళ్ల గోపాల్, దేవ రాజు మహరాజు లకు కూడా అవార్డులు లభించాయి. తగుళ్ల గోపాల్ కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం రాగా.. దేవ రాజు మహరాజు కు కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య అవార్డు వచ్చింది.
పల్లె ప్రజలు, ప్రకృతి గాయకుడు గోరటి వెంకన్న కు పాట లకు మూలాధారాలు కాగా… మా టీవీలో ప్రసారమైన రేలా రె రేలా కార్యక్రమానికి సుద్దాల అశోక్ తేజతో కలిసి న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. 2016లో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుండి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నాడు. 2016 కాళోజీ స్మారక పురస్కారాన్ని అందుకుంటున్న ప్రజాకవి, రచయిత, గాయకుడు గోరటి వెంకన్న.. 2016 కాళోజీ స్మారక పురస్కారాన్ని అందుకున్నారు. 2020, నవంబరులో శాసనమండలి సభ్యుడిగా (గవర్నర్ కోటా) ప్రమాణ స్వీకారం చేశాడు.