కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ ఆలోచిస్తుంటే..దీప ధైర్యం చెప్తుంది. కార్తీక్.. కోటేశ్-శ్రీవల్లికి అండగా ఉంటానంటాడు. దీప వద్దు చాలా ప్రమాదం అంటుంది. కార్తీక్ లేచి..దీప రిస్క్ అయినా పర్వాలేదు..నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తాను అంటాడు. దీప పోలీస్ స్టేషన్ కి వెళ్లి మీరు చేసేది ఏం ఉంది అంటే..ఏం చేయకున్నా..వాళ్లకు అండగా ఉంటాను అంటే..దీప వద్దంటుంది. కార్తీక్.. సాయం చేసే విషయంలో నాకన్నా నువ్వే ముందుంటావు..నాకేమైనా అవుతుందేమో అనే భయంతో వద్దన్నావు కదా అంటాడు. పాపం కోటేష్ శ్రీవల్లి మనకు ఆశ్రయం ఇచ్చారు.నేను వెళ్తాను అంటే.. మీరు వెళితే పిల్లలు-నేను భయంగా ఎదురుచూడాలని దీప.. గొడవల్లో జోక్యం చేసుకోవద్దని పిల్లలు చెప్పడంతో సరే అంటాడు కార్తీక్.
రుద్రాణి ఇంట్లో
బాబుని ఒళ్లో కూర్చోబెట్టుకున్న రుద్రాణి బాబుని నిద్రపుచ్చేందుకు తన అనుచరులను పాట పాడమంటుంది. ఇంతలో పోలీసులను తీసుకుని శ్రీవల్లి-కోటేశ్ అక్కడకు వస్తారు. తన అనుచరులు పోలీసులు వస్తున్నారని చెప్పడంతో ముందు నమ్మదు..అబ్బులుగాడు కిటికిలోంచి చూసి..శ్రీవల్లి కోటేష్ లు వస్తున్నారు అక్కా.అంటుంది. రుద్రాణి ఇంటికే పోలీసులు వస్తారా అని కోపంతో ఊగిపోతుంది. ఇన్నిసార్లు ఓడిపాయావ్..ఏంటే నీ ధైర్యం అని రుద్రాణి అంటే.. ఇన్నాళ్లూ కంప్లైంట్ ఇవ్వడానికి భయపడ్డారు కాబట్టి నేను ఏం చేయలేకపోయానంటుంది.
ఎస్ ఐ. శ్రీవల్లి కంప్లైంట్ ఇస్తే తీసుకోవడమే తప్పు..పైగా నా ఇంట్లో అడుగుపెట్టడం ఇంకా పెద్ద తప్పు అంటే..రుద్రాణి అని అరుస్తుంది. రుద్రాణి అక్కా అని పిలుపు అంటుంది. ఎస్ ఐ..రుద్రాణి రెండు చెంపలమీద లాగిపెట్టి కొడుతుంది. ఎస్ ఐ. నన్ను ఎదిరించి ఈ ఊళ్లో ఉంటాననుకుంటావా అనగానే.. ఇప్పటికే ట్రాన్స్ ఫర్ ఆర్డర్ వచ్చింది వెళ్లేముందు పాతలెక్కలు సెట్ చేసే వెళతా అంటుంది. బాబు ఇచ్చేయండ్రా అని ఎస్ ఐ అంటుంది. మొదట ఆ మనుషులు ఇవ్వరు..రోడ్డుమీద కొట్టుకుంటూ తీసుకెళ్తా బాబును ఇవ్వకుంటే అంటే..వాళ్లు ఇస్తారు. ఎ బాబుని శ్రీవల్లికి అప్పగిస్తుంది రుద్రాణి. తప్పు చేస్తున్నావు మాధురి అని ఎస్ ఐని ఉద్దేశించి అనడంతో..తప్పు గురించి నువ్వు మాట్లాడుతున్నావా రుద్రాణి అని ఫైర్ అవుతుంది. అందరని.. బయటకు పంపించి తలుపులు వేస్తుంది. కాసేపటి తర్వాత డోర్ తీసుకుని కుంటుకుంటూ బయటకు వచ్చిన రుద్రాణి..నాపైనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పెద్ద తప్పు చేశావ్ అని మనసులో అనుకుంటూ పోలీస్ స్టేషన్ కి వెళుతుంది.
సౌందర్య ఇంట్లో
కట్ చేస్తే కార్తీక్ ఫోన్ దొరికిన బిచ్చగాడు మహేష్ ని కానిస్టేబుల్ రత్నసీత … సౌందర్య ఇంటికి తీసుకొస్తుంది. ఆ ఇల్లును .మహేష్ ఆశ్యర్యంగా చూస్తాడు. కార్తీక్ ఫోన్ అమ్ముతుంటే తీసుకొచ్చా అని రత్నసీత సౌందర్యకు చెబుతుంది. మా అబ్బాయి ఫోను ఎలా వచ్చిందంటే..రత్నసీత కొట్టేసింది అంటుంది. మహేష్ నేను కొట్టేయలేదు నాకు దొరికింది అని చెబుతుంది. ఆ రోజు ఇంటి నుంచి వెళ్లిపోయేటప్పుడు కార్తీక్ ఓ చోట ఫోన్ పడేసి అక్కడినుంచి బస్సెక్కి వెళ్లిపోయిన విషయం చెబుతాడు బిచ్చగాడు. ఇదే విషయం డబ్బులు పంపించి ఓ మేడం అడిగింది కదా ఆ విషయం చెప్పాలా వద్దా అనే ఆలోచించేలోగా.. సౌందర్య థ్యాంక్యూ చెప్పి నీకు డబ్బులిస్తాను వాళ్లు ఎక్కిన చోటే బస్సెక్కి ప్రతి స్టాప్ లోనూ దిగి వాళ్లెక్కడున్నారో కనిపెట్టు అని అడుగుతుంది.
దీప-కార్తీక్
తమ్ముడు ఇంకా రాలేదంటమ్మా అని పిల్లలు అడుగుతారు. పిల్లలు ప్రశ్నలు అడగటం మొదలుపెడతారు.. వస్తారులే కాసేపు మాట్లాడకుండా కూర్చోండని దీప చెబుతుంది. ఇంతలో బాబుని తీసుకుని శ్రీవల్లి-కోటేశ్ రావడం చూసి పిల్లలు పరిగెత్తుకుని వెళ్తారు..ఏదైనా గొడవ జరిగిందా అని దీప అడిగితే..ఎస్ఐ వచ్చి రుద్రాణికి గట్టిగా సమాధానం ఇచ్చి బాబుని ఇప్పించారని చెబుతుంది శ్రీవల్లి. మిమ్మల్ని ఏవమనలేదుగా..అని కార్తీక్ అంటే.. రుద్రాణి పోలీస్ స్టేషన్ కి వెళ్లిందన్నమాటే కానీ వచ్చాక ఏం పగ తీర్చుకుంటుందో అనే భయం ఉందని శ్రీవల్లి చెప్పగానే.. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదంటారు దీప-కార్తీక్. మళ్లీ పంతులుగారికి ఫోన్ చేసి రమ్మను నామకరణం చేద్దాం అంటుంది దీప.
సౌందర్య ఇంట్లో..
డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న సౌందర్య …కార్తీక్, పిల్లల్ని తలుచుకుని బాధపడుతుంది. అందరం సరదాగా కూర్చుని భోజనం చేసేవాళ్లం..మనవరాళ్లు ఏవేవో ప్రశ్నలు అడిగేవాళ్లు..ఇప్పుడు ఎక్కడున్నారో ఏమో అని బాధపడుతుంది. ఆనంద్ రావు ఎక్కడున్న సంతోషంగా ఉన్నారనే అనుకుందాం అంటాడు. సౌందర్య.. శ్రావ్య మీ అమ్మానాన్నలకి ఈ విషయం తెలుసా, ఈ మధ్య ఫోన్ చేయడం లేదు ఇంటికి రావడం లేదు ఏమైందని అడుగుతుంది. ఇలాంటి పరిస్థితి ఊహించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదనే బావగారు, దీపక్క పిల్లలు వైజాగ్ షిప్ట్ అయ్యారని చెప్పానంటుంది శ్రావ్య. అబద్ధం చెప్పినా అత్తింటి పరువు నిలబెట్టావంటాడు ఆనందరావు. జరిగేవి ఏవి మనం ఆపలేం..వాళ్లు ఎక్కడున్నా బాగానే ఉంటారు అంటాడు.
ఇక్కడ కార్తీక్ కు దీప ఏదో తీసుకొచ్చి తినండి అంచుంది. ఏంటి దీప హుషారుగా ఉన్నావ్ అంటే..అవును అంటుంది దీప. ఎపిసోడ్ ముగుస్తుంది.
రేపటి ఎపిసోడ్ లో
వీడు గొప్పోడు స్వామీ… నామకరణానికి అడ్డొచ్చిందని రుద్రాణిని పోలీస్ స్టేషన్ కి పంపించేశాడు అంటుంది దీప. అయితే ఆ రుద్రాణి రాత్రే ఇంటికి వచ్చేసింది దీప , ఊర్లో అంతా అదే మాట్లాడుకుంటున్నారు.. ఆమె పగబడితే మామూలుగా ఉండదు..కోటేష్-శ్రీవల్లికి ప్రమాదం పొంచిఉందని చెబుతాడు కార్తీక్. ఆ మాటలు విని దీప షాక్ అవుతుంది. మరోవైపు బండిపై వెళుతున్న శ్రీవల్లి-కోటేశ్ ను లారీతో గుద్దించేస్తుంది రుద్రాణి.