కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలోని పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్రం ఈ నిధులను విడుదల చేసింది. ఏపి, తెలంగాణ కు కూడా కేంద్రం నిధులను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఏపీకి 581 కోట్లు… తెలంగాణకు 409 కోట్ల గ్రాంటు కేంద్రం విడుదల చేసింది. తాగునీరు, పారిశుద్ధ్యం, వర్షపు నీటి సంరక్షణ కోసం ఈ నిధులను ఖర్చు చేయాలని కేంద్రం ఆదేశించింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఏపీకి 969 కోట్లు, తెలంగాణకు 682 కోట్ల ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో ఈ నిధులు జమ అయిన 10 రోజులకే వాటిని స్థానిక పంచాయితీ ఖాతాలకు బదిలీ చేయనున్నారు. పది రోజులు ఆలస్యమైనా వడ్డీతో సహా రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీ ఖాతాలోకి జమ చేయాలని కేంద్రం ఆదేశించింది .ఇక ఈ నిధుల ద్వారా తెలంగాణ మరియు ఏపీ లోని పల్లెల్లో తాగునీటి కష్టాలు తీరనున్నాయి. అలాగే పారిశుద్ధ్య పనులు జరగనున్నాయి.