భార్య వేధింపులు తట్టుకోలేక పోలీస్ స్టేషన్ కు నిప్పు.. అరెస్టు చేసిన పోలీసులు

భార్య వేధింపులు తట్టుకోలేని వ్యక్తి చేసిన ఓ చర్య సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొద్ది కాలం క్రితం పెళ్ళి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న గుజరాత్ కి చెందిన పరమానందం, అనతి కాలంలో భార్య వేధింపులకు గురయ్యాడు. ప్రరీరోజూ భార్య వేధింపులను తట్టుకోలేకపోయాడు. దాంతో ఏం చేయాలో తెలియక, పోలీస్ స్టేషన్ కి నిప్పటించాడు. అవును, భార్య వేధింపులు, బాధలు తట్టుకోలేక దగ్గరలోని పోలీస్ స్టేషన్ పై దాడి చేసాడు. ఇది గుర్తించిన పోలీసులు పరమానందాన్ని అదుపులోకి తీసుకున్నారు.

ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు గాను పరమానందాన్ని అరెస్టు చేసారు. పోలీస్ స్టేషన్ కి నిప్పంటించడానికి కారణం చెప్పిన పరమానందం పోలీసులను ఆశ్చర్య పరిచాడు. భార్య బాధలను తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాలేదని, అందుకే ఇలా చేసానని, భార్యతో ఇంట్లో ఉండడం కన్నా, జైల్లో ఉండడమే నయం అని, అందుకే ఈ విధంగా చేసానని చెప్పుకొచ్చాడు.