ఏపీకి కేంద్రం షాక్.. పంచాయతీలకు నిధులు ఇవ్వలేమని ప్రకటన

-

ఏపీకి కేంద్రం షాక్ ఇచ్చింది. 14వ ఆర్థిక సంఘం కాలవ్యవధి ముగిసినందున, పంచాయతీలకు పాత నిధులు ఇవ్వలేమని కేంద్రం ప్రకటన చేసింది. రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు పంచాయితీ రాజ్‌ శాఖ సహాయ మంత్రి కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్‌ జవాబు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం బకాయిపడిన 529.96 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయలేమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపినట్లు వెల్లడించారు పంచాయితీ రాజ్‌ శాఖ సహాయ మంత్రి కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్‌.

రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు పంచాయితీ రాజ్‌ శాఖ సహాయ మంత్రి కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్‌. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం (2015-20) సిఫార్సు చేసిన మొత్తం నిధులలో సుమారు రూ. 529 కోట్లు విడుదల కాలేదని మంత్రి కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్‌ పేర్కొన్నారు. ఈలోగా 14వ ఆర్థిక సంఘం అవార్డు కాలవ్యవధి ముగిసిపోయుందని .. ఈ కారణంగా స్థానిక సంస్థలకు ఆ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన నిధులను ఇవ్వలేమని చెప్పారు మంత్రి కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్‌.

Read more RELATED
Recommended to you

Latest news