తిరుపతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రదర్ అనిల్ కొత్త రాజకీయ పార్టీ పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు గత వారం, పది రోజుల నుంచి వార్తలు వస్తున్నసంగతి తెలిసిందే. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందని.. వైసీపీని గెలిపించిన వారికి న్యాయం జరగడం లేదని బ్రదర్ అనిల్ వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగానే పార్టీ పెట్టి ఎందుకు అడుగులు వేస్తున్నారు బ్రదర్ అనిల్. అయితే బ్రదర్ అనిల్ నిర్ణయంపై ఏపీ క్రిస్టియన్ జేఏసీ మండిపడింది.
బ్రదర్ అనిల్ కు కౌంటర్ గా ఏపీ క్రిష్టియన్ జేఏసీ మీడియా సమావేశం నిర్వహించింది. బ్రదర్ అనిల్ రాజకీయ పార్టీ పెడతాననడం హాస్యాస్పదమని.. దైవ సందేశం అందించే బ్రదర్ అనిల్ ఎప్పుడు రాజకీయ అవతారం ఎత్తాడో చెప్పాలని ఫైర్ అయ్యారు. తెలంగాణలో పెట్టుకున్న పార్టీ పనులు చూసుకోండి కానీ ఏపీ రాజకీయాల్లో తలదూర్చకండని మండిపడ్డారు.
అగ్రకులానికి చెందిన బ్రదర్ అనిల్ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఉద్ధరిస్తాననడంలో అంతర్యమేంటి ? కేఏ పాల్ పతనం తర్వాత బ్రదర్ అనిల్ ను వైఎస్ రాజశేఖర్ రెడ్డి శాంతి దూతగా ప్రపంచానికి పరిచయం చేశాడని ఫైర్ అయ్యారు. బ్రదర్ అనిల్ రాజకీయాల్లో తలదూర్చకూడదని ప్రేమగా హెచ్చరిస్తున్నా,మని ఏపీ క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ ఎలమంచిలి ప్రవీణ్ పేర్కొన్నారు.